వైఎస్సార్‌సీపీ నాయకులపై రాళ్ల దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకులపై రాళ్ల దాడి

Oct 23 2026 2:03 AM | Updated on Oct 23 2026 2:03 AM

టాస్క్‌ఫోర్స్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన మండల కేంద్రం కృష్ణగిరిలో గురు వారం సాయంత్రం చోటు చేసుకుంది. రాళ్లదాడిలో కానిస్టేబుల్‌ రాఘవేంద్రప్రసాద్‌ తలకు గాయమైంది. వైఎస్సార్‌సీపీ చెందిన చిట్యాల ఎంపీటీసీ అభ్యర్థి బాల ఈశ్వర య్య, ఎరుకలచెరువు ఎంపీటీసీ అభ్యర్థి బోయ సంజమ్మ, చిట్యాలకు చెందిన ముద్దారం రామలింగడు, రమేష్‌, భూతం మల్లికార్జున, లాలప్ప, గోపాల్‌, కోయిలకొండకు చెందిన కొక్కు మద్దిలేటి, కృష్ణ, నడిమింటి మదన్‌, మన్నెకుంటకు చెందిన చిన్న బజారి, బోయ వెంకటేశ్వర్లు గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ వారిని నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవాలని టీడీపీ వారు పెద్ద ఎత్తున ఉదయం నుంచే కృష్ణగిరి చేరుకున్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ వారు కూడా మూకుమ్మడిగా నామినేషన్‌ వేసేందుకు రాగా మధ్యా హ్నం తర్వాత అవకాశం ఇస్తామని ఎస్‌ఐ హనుమంతరెడ్డి చెప్పడంతో అప్పటి వరకు వేచిచూశారు. సాయంత్రం అవుతున్నా పోలీసుల నుంచి ఎలాంటి సమాచా రం లేకపోవడంతో నామినేషన్‌కు సమయం దగ్గర పడుతుందని వచ్చారు. దీన్ని గమనించిన టీడీపీ వారు వారిని అడ్డుకున్నారు. రాళ్లతో దాడికి దిగారు. అడ్డుపోయిన కానిస్టేబుల్‌ రాఘవేంద్రప్రసాద్‌కు గాయమైంది. ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. పరిస్థితిని గమనించిన పోలీసులు ముందు జాగ్రత్తగా తగినంత సిబ్బందిని లేకపోవడంతో దాడి జరిగినట్లు తెలుస్తోంది.

నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలి

గొడవ జరిగిన అనంతరం కర్నూలు నుంచి వచ్చిన సీఐ మారుతి శంకర్‌ తమకు నామినేషన్‌ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ముద్దారం బాల ఈశ్వరయ్య, బోయ సంజమ్మ, కరివేములు వెంకటేశ్వర్లు తదితరులు తెలిపారు. అయితే సాయంత్రం ఐదు గంటల కాగానే పోలీసులు సైతం ఏ విషయం చెప్పకుండా వెళ్లిపోయారన్నారు. ప్రజాస్వామయంలో ఉన్నామా లేక ఎక్కడైనా ఉన్నామని అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక నామినేషన్‌ అడ్డుకోవడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement