పాలనా వైఫల్యంతో అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. దీంతో మునిసిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతోంది. నామినేషన్లు వేయకుండా | - | Sakshi
Sakshi News home page

పాలనా వైఫల్యంతో అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. దీంతో మునిసిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతోంది. నామినేషన్లు వేయకుండా

Oct 22 2026 7:02 AM | Updated on Oct 22 2026 7:02 AM

అక్రమ నిర్బంధంపై ఆగ్రహం

● బనగానపల్లె పోలీసు స్టేషన్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ధర్నా

బనగానపల్లె రూరల్‌: వైఎస్సార్‌సీపీ నాయకుల అక్రమ నిర్బంధంపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫైర్‌ అయ్యారు. వెంటనే తమ వారిని విడుదల చేయాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బనగానపల్లె అర్బన్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికారపార్టీ కుయుక్తులు పన్నింది. పోలీసులపై ఒత్తిడి పెంచి బుధవారం బనగానపల్లె నియోజకవర్గంలోని ఆయా పోలీస్‌స్టేషన్లలో వైఎస్సార్‌సీపీ నాయకులు, అభ్యర్థులను అక్రమంగా నిర్బంధించింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి..వెంటనే పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబులరెడ్డి, అవుకు మండల కన్వీనర్‌ కాటసాని తిరుపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు కాటసాని ప్రసాదరెడ్డితో కలిసి పట్టణ పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకొని అక్కడే ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఓటమి భయంతో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. రాత్రికి రాత్రి తమ పార్టీ అభ్యర్థులను, నాయకులను తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌లలో నిర్బంధించడం, నామినేషన్‌ పత్రాలను లాక్కోవడం సరికాదన్నారు. బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కాగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకొని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డోన్‌ డీఎస్పీ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వద్దకు వచ్చి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన ఆందోళన విరమించారు.

ఎవరూ భయపడొద్దు

స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కూటమి నాయకుల దాడులు, దౌర్జన్యాలకు, పోలీసుల అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని అన్నారు. వైఎస్సార్‌సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ధైర్యంగా ఎన్నికల బరిలో దిగాలని పిలుపునిచ్చారు. ఆందోళనలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి అత్తార్‌జాహెద్‌, లీగల్‌ సెల్‌ కార్యదర్శి అబ్దుల్‌ఖైర్‌, బనగానపల్లె మండల కన్వీనర్‌ జనార్థన్‌రెడ్డి, అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు అంబటిరవి కుమార్‌రెడ్డి, అనిల్‌,శంకర్‌రెడ్డి, సాధిక్‌, ఖానిక్‌, కాటసాని రామకృష్ణారెడ్డి, జీటీ వెంకట్రామిరెడ్డి, గడ్డం వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్‌, కృష్ణ, లారీ కరీం, రమణ, సురేష్‌, కలాం, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

కోవెలకుంట్ల/సంజామల: తెల్లారక ముందే బనగానపల్లె నియోజకవర్గంలోని వివిధ మండలాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులను పోలీసులు పోలీస్‌స్టేషన్లకు తరలించి అక్రమంగా నిర్బంధించారు. వైఎస్సార్‌సీపీ కోవెలకుంట్ల మండల అధ్యక్షుడు బీవీ నాగార్జునరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుధాకర్‌రెడ్డి, వాణిజ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిక్కేపల్లి ప్రసాదరెడ్డి, సౌదరదిన్నె మాజీ సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంజామల మండలంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చిన్నబాబు, సీనియర్‌ నాయకులు పోచా వెంకట్రామిరెడ్డి, ఆకుమల్ల గౌరిగారి నాగేశ్వరరెడ్డి, వసంతాపురం సత్యమయ్య, రామిరెడ్డిపల్లె సోమ సుందర్‌ రెడ్డి, ఆల్వకొండ ప్రసాద్‌ రెడ్డి, బత్తుల రామచంద్రారెడ్డి తదితరులను పోలీస్‌స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించారు. బనగానపల్లె, కొలిమిగుండ్ల మండలాల్లో సైతం పలువురు నేతలను బలవంతంగా పోలీస్‌స్టేషన్లకు తరలించి నామినేషన్లు వేయడానికి వీలు లేదని టీడీపీ అభ్యర్థుల ఏకగ్రీవాలకు సహకరించాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. నామినేషన్‌ కేంద్రాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వెళ్లకుండా నామినేషన్‌ పత్రాలను ఆయా పోలీస్‌స్టేషన్లలో ఉంచుకున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిన వెంటనే బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పట్టణంలోని అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

అధికార పార్టీ నేతలకు రూల్స్‌ వర్తించవా?

సంజామల మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నామినేషన్‌ సెంటర్‌లోకి అధికార పార్టీకి చెందిన నాయకులను మాత్రమే అనుమతి ఇస్తూ ఇతర పార్టీ నాయకులను, జర్నలిస్టులను లోపలికి పంపడం లేదు. ప్రతిపక్షపార్టీల నాయకులు లోపలికి రాకుండా ఏకంగా ఎంపీడీఓ కార్యాలయం ప్రధాన గేట్‌కు తాళాలు వేశారు. అధికారపార్టీకి ఒక విధంగా మిగతా పార్టీలకు మరో విధంగా రూల్స్‌ ఉంటాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను

ఏకగ్రీవం చేసుకునేందుకు కుయుక్తులు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు,

నాయకుల అక్రమ నిర్బంధం

పోలీస్‌స్టేషన్లలో నామినేషన్‌ పత్రాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement