పెట్రేగిన పచ్చమూకలు | - | Sakshi
Sakshi News home page

పెట్రేగిన పచ్చమూకలు

Oct 22 2026 7:02 AM | Updated on Oct 22 2026 7:02 AM

● బాచేపల్లిలో వైఎస్సార్‌సీపీ

నాయకులపై దాడి

● అహోబిలంలో అర్ధరాత్రి

వైఎస్సార్‌ సీపీ జిల్లా గిరిజన విభాగం

అధ్యక్షుడిని తీసుకెళ్లిన పోలీసులు

ఆళ్లగడ్డ: ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ మొదలైన మొదటి రోజే టీడీపీ శ్రేణులు, పోలీసులు అరాచకం సృష్టించారు. పచ్చ రౌడీలు ముసుగులు వేసుకుని కర్రలు, రాడ్లతో గ్రామాల్లో తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్‌ సీపీ నేతలే లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. అడ్డుకోవాల్సిన పోలీసులు తమ స్వామి భక్తిని చాటుకున్నారు. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థి ఎన్‌ఓసీ కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గ్రామ సచివాలయం దగ్గర ఉన్నారు. అంతలో రెండు వాహనాల్లో వచ్చిన ముసుగు ధరించిన రౌడీలు ఒక్కసారిగా కర్రలు, రాడ్లు తీసుకుని వారిపై దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టడంతో న్యాయవాది గండికోట విక్రమసింహ (హర్షవర్ధన్‌), ప్రసాద్‌, నాగయ్య, నాగేశ్వర్‌రావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నంద్యాల వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

గిరిజనుడిపై పోలీస్‌ ప్రతాపం

అహోబిలంలో వైఎస్సార్‌సీపీ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు నాసారి వెంకటేశ్వర్లు ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఎత్తుకుపోయారు. ఉదయం 9 గంటల వరకు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచుకుని అనంతరం నియోజకవర్గంలో ఉండకూడదని హుకుం జారీ చేసి వదిలి పెట్టారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మొరపెట్టుకున్నా ససేమిరా అంటూ నియోజకవర్గ బహిష్కరణ చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గాయపడిన ప్రసాద్‌ , నాగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement