నందికొట్కూరు: తెలుగు దేశం పార్టీకి నందికొట్కూరు నియోజకవర్గంలో ఎదురు దెబ్బ తగిలింది. బుధవారం మండలంలోని కొణిదేల గ్రామం టీడీపీ మాజీ సర్పంచు కురువ శివన్న, నాయకులు లక్ష్మిరెడ్డి, శేఖర్‌రెడ్డి, కొంగర అయ్యన్నతో పాటు 200 కుటుంబాలు బుధవారం వైఎస్సార్సీపీలో చేరాయి. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దార సుధీర్, యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వారికి వైఎస్సార్సీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు నచ్చక పలువురు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. గ్రామస్థాయి నాయకులు యుగంధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సర్వేశ్వరరెడ్డి, కొంగర గణేష్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.


