నంద్యాల(న్యూటౌన్): జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేఽశించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ కేంద్రాన్ని, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్‌ల స్వీకరణకు ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, హెల్ప్‌డెస్క్ సిబ్బంది విధుల నిర్వహణలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాలన్నారు. నామినేషలు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు తగిన స్థలాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రాన్ని వంద మీటర్ల పరిధికి వెలుపల వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సంబంధిత అధికారులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. బాధ్యతలు అప్పగించిన అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా సజావుగా నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట ఏఎస్పీ సుస్మిత, జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


