టీడీపీకి ఎదురు దెబ్బ! | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఎదురు దెబ్బ!

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

టీడీపీకి ఎదురు దెబ్బ! కర్నూలు మేయర్‌ పీఠం వైఎస్సార్‌సీపీదే!

● వైఎస్సార్‌సీపీలో చేరిన

అధికార పార్టీ నాయకులు

చిప్పగిరి: అధికార టీడీపీకి ఆలూరు నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. దేవనకొండ మండలం పీ కోటకొండ గ్రామంలో టీడీపీకి చెందిన 102 కుంటుంబాల సభ్యులు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రజలకు నచ్చడం లేదన్నారు. ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారన్నారు. అభివృద్ధి చేస్తున్నామని టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వైకుంఠం జ్యోతి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛన్‌ ఇవ్వలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేయాలని సూచించారు. గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు కప్పట్రాళ్ల దివాకర్‌ నాయుడు, హనుమంతరెడ్డి, మీనుగ కృష్ణ, అల్లంకొండ మాజీ ఎంపీటీసీ రంగడు, లక్ష్మణ స్వామి, ముచ్చు రామచంద్ర కుమార్‌ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ నాయకులు లక్ష్మీనారాయణ, రాజేష్‌, కౌలుట్లయ్య తదితరులు ఉన్నారు.

● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్వీ విజయమనోహరి

కర్నూలు (టౌన్‌): కర్నూలు నగర మేయర్‌ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ తప్పకుండా కై వసం చేసుకుంటుందని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్వీ విజయమనోహరి అన్నారు. ప్రజల మద్దతు వైఎస్సార్‌సీపీకే ఉందన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని 23వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రమణ నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమంలో మేయర్‌ అభ్యర్థి సుశీలతో కలిసి ఆమె పాల్గొన్నారు. అలాగే నగరంలోని 57వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా లక్ష్మీ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీ విజయ మనో హరి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన హామీలను ఎందుకు అమ లు చేయడం లేదో ప్రజలు నిలదీయాలన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశారన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలతో మభ్యపెట్టారన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి అని తెలిసి దాడులకు పాల్పడుతున్నారన్నారు. పోటీ చేయకుండా అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేకంగా జీవో తెచ్చుకొని తాము గెలవలేమని సీఎం చంద్రబాబు ప్రకటించాలన్నారు. ప్రజాభిప్రాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖూనీ చేస్తుందని విమర్శించారు. ఎవ రు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గబోరన్నారు.

తేలికపాటి వర్షాలే!

కర్నూలు(అగ్రికల్చర్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతాయని రైతులు ఆశించారు. అయితే మూడు మండలాల్లో కేవలం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ నెల 17న కోడుమూరులో 9.6 మి.మీ., ఓర్వకల్లులో 8.8 మి.మీ., ఆదివారం హాలహర్విలో 8.6 మి.మీ. వర్షం కురిసింది. ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ వర్షపాతం 402.6 మి.మీ. ఉండగా.. 232 మి.మీ. మాత్రమే నమోదైంది. అక్టోబరు నెల సాధారణ వర్షపాతం 109.9 మి.మీ. ఉండగా..18 రోజుల్లో కేవలం 2.3 మి.మీ. నమోదైంది. రబీ సీజన్‌లో ప్రధాన పంట శనగ కాగా.. సబ్సిడీపై 25 వేల క్వింటాళ్లు పంపిణీ చేశారు. వెల్దుర్తి, కోడుమూరు, సీ బెళగల్‌, గూడూరు తదితర ప్రాంతాల్లో అంతంతమాత్రం తేమలోనే శనగ విత్తనాలు విత్తుకున్నారు. తగిన తేమ లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనగ పండాలంటే నవంబరు, డిసెంబరు నెలల్లో చలి, మంచు అవసరం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే వానలే కాదు చలి, మంచు కురిసే అవకాశమే లేదని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement