అధికార పార్టీ బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ బరితెగింపు

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

డోన్‌: మున్సిపల్‌ ఎన్నికల నామినేష్ల ప్రక్రియలో అధికార పార్టీ పోలీసులు, అధికారుల అండతో బరితెగిస్తోంది. డోన్‌ పట్టణంలో ఆదివారం టీడీపీ రెబల్‌ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్న సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోట్రికే హరి కిషన్‌ భార్య పద్మజను నామినేషన్‌ దాఖలు చేయనీయకుండా పోలీస్‌ అధికారులు అడ్డుకున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన ఆదివారం నామినేషన్‌ వేసేందుకు కోట్రికే పద్మజ వచ్చారు. కార్యాలయ ఆవరణలో ఆమెను గంటల తరబడి కూర్చోబెట్టారు. అయితే టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ మాత్రం వెంటనే నామినేషన్‌ వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమయం మించి పోవడంతో నామినేషన్‌ వేయకుండానే కోట్రికే పద్మజ వెనుదిరగాల్సి వచ్చింది. టీడీపీ కోసం మూడేళ్ల నుంచి కృషి చేసిన తమ కుటుంబానికి టికెట్‌ దక్కకపోగా, స్వతంత్రంగా నామినేషన్‌ వేసే అవకాశాన్ని కూడా పోలీసుల ద్వారా అడ్డుకున్నారని కోట్రికే హరికిషన్‌ అన్నారు. ఆయన కేంద్రం నుంచి బయటకు వస్తూ కన్నీళ్ల పర్వంతమైన్నట్లు కన్పించగా అనుచరులతో పాటు సతీమణి పద్మజ ఓదారుస్తూ అక్కడే ఉన్న వాహనంలోకి ఎక్కించారు. అక్కడే హరికిషన్‌ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన సతీమణి కల్పించుకుని అడ్డుకున్నారు. అలాగే తన కుమార్తెను నామినేషన్‌ వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని సీపీఎం నాయకురాలు షమీమ్‌ బేగం తెలిపారు. ఇది ఇలా ఉండగా మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ సతీమణి సుమిత్ర తరపున నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ గుండాలు దాడి చేసి నామినేషన్‌ పత్రాలను లాక్కొని వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement