● 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
నంద్యాల(అర్బన్): నామినేషన్ల ముగింపు రోజు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలు చోటు చేసుకోవడం తమ పార్టీ విజయానికి సంకేతమని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. 52వ వార్డు టీడీపీ ఇన్చార్జి శివనాగిరెడ్డి 50 కుటుంబాలతో వైఎస్సార్సీపీలో చేరడం శుభపరిణామమన్నారు. శివనాగిరెడ్డికి మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిశోర్రెడ్డిలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో శిల్పా రవి మాట్లాడుతూ.. వైఎస్సార్ నగర్ నుంచి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి శివనాగిరెడ్డి, వారి కుటుంబాలు రావడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్‌నగర్ అభివృద్ధికి లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాస్టర్ ఏసుపాదం, చాంద్‌బాషా, పెయింటర్ సుధాకర్, టైలర్ బాబు, స్టీఫెన్, నాగేంద్రబాబు, బత్తుల చెన్నయ్య, కృపావరం, విశాలాక్ష్మి, ప్రశాంతి, రామేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.


