ప్రసన్న రూపిణి.. మహాగౌరి | - | Sakshi
Sakshi News home page

ప్రసన్న రూపిణి.. మహాగౌరి

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

శ్రీశైలంటెంపుల్‌: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో ఎనిమిదవ రోజు ఆదివారం భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తిని మహాగౌరి స్వరూపంలో అలంకరించారు. ప్రత్యేక అలంక్రీకృత అమ్మ వారి ఉత్సవమూర్తిని ఆలయం ఎదురుగా ఏర్పాటుచేసిన వేదికపై ఆశీనులను చేశారు. అర్చకులు, వేదపండితులు విశేష పూజా హారతులిచ్చారు. నవదుర్గలలో మహాగౌరి రూపం అత్యంత శాంతమూర్తిగా చెప్పబడుతుంది. ఈ దేవిని పూజించడం వలన సకల పాపాలు నశించి, కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకమని వేదపండితులు వివరించారు. దసరా మహోత్సవాల్లో భాగంగా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను నంది వాహనసేవపై అలంకరించారు. అలంకార మండపంలోకి నంది వాహనాన్ని అధిష్టించిన స్వామిఅమ్మవార్లను ఉంచి పూజలు చేశారు. అనంతరం మహాగౌరి దేవికి, నందీవాహనాధీళులైన దేవదేవుళ్లకు ఆలయ ఉత్స వం నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గ్రామోత్సవంలో కోలాటాలు, డప్పు వాయిద్యాలు, కళాకారుల విచిత్ర వేషధారణలు, సంప్రదాయ నృత్యప్రదర్శనలతో గ్రామోత్సవం వైభవంగా సాగింది. స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు దంపతులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో నేడు..

దసరా ఉత్సవాల్లో తొమ్మిదవ రోజు సోమవారం ఉద యం భ్రమరాంబాదేవి సిద్ధిదాయిని అలంకారంలో, స్వామిఅమ్మవార్లు కై లాస వాహనసేవలో దర్శనమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సోమవారం మంత్రి బీసీ జనార్థనరెడ్డి పట్టువస్త్రాలు స్వామిఅమ్మవార్లకు సమర్పించనున్నారు.

అభయ ప్రదాయినీ.. మహాగౌరి పార్వతీదేవి అవతారంలో శివుణ్ణి భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేయడంతో అమె శరీరం పూర్తిగా నల్లబడింది. ఆ తపస్సుకు సంతోషించిన పరమేశ్వరుడు ప్రసన్నుడై ఆమె శరీరంపై గంగాజలం చల్లాడు. దీంతో అమె తెల్లని వర్ణాన్ని (గౌర వర్ణం) పొందింది. ఈ దేవి నాలుగు చేతులలో అభయ, వరముద్రలతో పాటు త్రిశూలం, డమరుకాలను ధరించి ఉంటుంది. దవళ కాంతితో మెరిసే వృషభాన్ని అధిరోహించి భక్త జనకోటికి అభయప్రదానం చేస్తుంది.

మహాగౌరి స్వరూపంలో

శ్రీశైల భ్రామరీ

నందివాహనంపై దేవదేవుళ్లు

శ్రీశైలంలో వైభవంగా

దసరా మహోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement