ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

నంద్యాల(న్యూటౌన్‌): స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ వెంకట మురళి అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత, ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్ల పై ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ వెంకట మురళీ, ఎక్స్‌పెండేచర్‌ అబ్జర్వర్‌ పి.శ్యామల సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, అడిషనల్‌ ఎస్పీ ఖాదర్‌ బాషా, సబ్‌ కలెక్టర్‌ మనీషా, సంబంధిత ఎన్నికల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ వెంకట మురళీ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు, భావోద్వేగాలు, ఆధిపత్య పోటీ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం విక్రయాలు నిలిపివేసే నిబంధనను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 28 మండలాల్లో 28 జెడ్పీటీసీ స్థానాలు, 28 ఎంపీపీలు, 377 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్‌ వివరించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి 489 గ్రామ పంచాయతీలు, 4,920 వార్డుల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement