కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి | - | Sakshi
Sakshi News home page

కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

గోస్పాడు: ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సలహాదారు, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ సూచించారు. శనివారం నంద్యాల పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ సూర జ్‌ ధనుంజయ్‌, సబ్‌ కలెక్టర్‌ మనీషా, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన అధికారి నాగరాజులతో కలిసి వ్యవసాయ, ఉద్యాన రంగాల పురోగతి, ప్రకృతి వ్యవసాయ విస్తరణపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. భూమి ఉత్పాదకతను కాపాడుతూ సాగును కొనసాగించేలా దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. జూన్‌ 2027 వరకు నిర్దేశించిన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక, సాగు విధానాలు, నీటి వినియోగంపై రైతులకు తగిన సాంకేతిక మార్గదర్శకత్వం అందించాలన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్‌ యాంకర్‌ జలాల్‌, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వై.శ్రీనివాసులు, అదనపు ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అబ్దుల్‌ సలాం, ఎన్‌ఎఫ్‌ఏలు, ఎఫ్‌ఎంటీలు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement