సర్వ శుభంకరీ...శ్రీ కాళరాత్రి దుర్గ ! | - | Sakshi
Sakshi News home page

సర్వ శుభంకరీ...శ్రీ కాళరాత్రి దుర్గ !

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

మహానంది: దసరా నవరాత్రి దుర్గా రూపాల్లో కాళరాత్రి దుర్గా స్వరూపం భయంకరంగా కనిపించినప్పటికీ భక్తుల పాలిట ఆమె సర్వ శుభాలను ప్రసాదించే సర్వ శుభంకరి అని మహానంది ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. మహానందిలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏడవ రోజు కామేశ్వరీదేవి అమ్మవారు మహాసరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి వేదపండితులు, రుత్విక్కులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ కాళరాత్రి రూపం బాహ్యంగా ఉగ్రరూపంలో కనిపించినా అంతరార్థంలో విముక్తికి దారి చూపే శక్తి స్వరూపిణి అన్నారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకు ఈ స్వరూపం ఎంతో ముఖ్యమని వివరించారు. రాత్రి శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు వ్యాఘ్ర(పులి)వాహనంపై కొలువై ఆలయ ప్రాకారాల్లో విహరించారు. ముందుగా అమ్మవారికి విశేష అలంకరణ, మహా మంగళహారతులు, బలిహరణ పూజల తర్వాత పులివాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఉత్సవాన్ని చేపట్టగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి శ్రీ కాళరాత్రి దుర్గా...మమ్ము కాపాడవమ్మా అంటూ ప్రణమిల్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement