వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

తుగ్గలి : మండల పరిధిలోని ముక్కెల్లకు చెందిన హరిజన రాముడు (38) మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దకు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతికి గల కారణాలు పోలీసులు విచారణలో వెల్లడికావాల్సి ఉంది. మృతుడి భార్య పిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తుగ్గలి పోలీసులు తెలిపారు.

యువకుడిపై

పోక్సో కేసు నమోదు

కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లెకు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని బేకరి షాపులో పని చేసే యువకుడు విజయ్‌ స్వీట్స్‌ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించగా అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం వాస్తవమని తెలింది. దీంతో ఆ యువకుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యకి దుర్మరణం

డోన్‌ టౌన్‌: పట్టణ సమీపంలోని వెంకటాపురం సర్కిల్‌(కంబాలపాడు)లో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని కమలాపురం గ్రామానికి చెందిన శేషన్న కుమారుడు గడ్డం సురేష్‌ (29) మృతి చెందాడు. పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో నివాసం ఉండే మృతుడు స్థానిక ఒక లాడ్జీలో పని చేస్తూ జీవనం సాగించే వాడు. బుధవారం ఉదయం లాడ్జి వైపు వెళుతుండగా వెంకటాపురం సర్కిల్‌ వద్ద వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

కోలుకోలేక యువకుడి మృతి

పాణ్యం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షాకిర్‌ (22) అనే యువకుడు కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. నంద్యాల పట్టణంలోని గిరినాథ్‌సెంటర్‌కు చెందిన ఈ యువకుడు మంగళవారం సాయంత్రం బైక్‌పై పాణ్యం వైపు వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. స్థానికులు క్షతగాత్రుడిని చికి త్స నిమిత్తం శాంతిరామ్‌ ఆసుపత్రికి తరలించ గా కోలుకోలుక బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ తెలిపారు.మృతుడు ఆర్‌జీఎం ఇంటర్నేషియల్‌ స్కూ ల్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేసేవారు. ఒక్కగానొక కుమారుడు అకాల మరణంతో తల్లిందండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పొలంలో మహిళపై దాడి.. ఆభరణాలు చోరీ

బండి ఆత్మకూరు: పట్టపగలు మహిళపై దాడి చేసి ఓ దుండగుడు శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఈర్నపాడు గ్రామానికి చెందిన యర్రం పార్వతమ్మ బర్రెలు మేపటానికి పొలానికి వెళ్లింది. మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో చెట్టు కింద కూర్చుంది. గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. దెబ్బలకు తాళలేక ఆమె సొమ్మసిల్లి పడిపోగా మెడలోని బంగారు గొలుసుతో పాటు చెవి కమ్మలు అపహరించుకొని నిందితుడు అక్కడి నుంచి సంతజూటూరు వైపు పరారయ్యాడు. కాగా చోరీ సొత్తు ఖరీదు సుమారు రూ. 6 లక్షల వరకు ఉంటుంది. ఈ మేరకు బాధితురాలి భర్త యర్రం గోపాల్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల రూరల్‌ సీఐ శ్రీనివాసుల్‌ రెడ్డి, ఎస్‌ఐ జగన్‌ మోహన్‌ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement