మొదటి అవకాశం ఎవరిదో? | - | Sakshi
Sakshi News home page

మొదటి అవకాశం ఎవరిదో?

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

● జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అన్‌ రిజర్వ్‌డ్‌గా కేటాయింపు

● జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అన్‌ రిజర్వ్‌డ్‌గా కేటాయింపు

నంద్యాల(అర్బన్‌): కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లా జెడ్పీ చైర్మన్‌ పదవి మొదటిసారి ఏ వర్గానికి అవకాశం లభిస్తోందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నంద్యాల జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి అన్‌ రిజర్వ్‌డ్‌గా కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి గెజిట్‌ విడుదల చేసింది. మొన్నటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే జిల్లా పరిషత్‌ పాలన సాగింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నూతన జిల్లాగా నంద్యాల ఏర్పాటైంది. నాలుగేళ్లుగా కర్నూలు నుంచే అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లా పరిషత్‌ వేరు చేస్తూ నంద్యాలలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం కర్నూలు జెడ్పీ నుంచి 45 మంది ఉద్యోగులను నంద్యాల జెడ్పీలోకి తీసుకొని వచ్చారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ భవన సముదాయంలోని ఎమ్మార్సీ భవనంలో జెడ్పీ కార్యాలయం ఏర్పాటు అయ్యింది. వచ్చే జెడ్పీటీసీ ఎన్నికల్లో 28 మంది జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. మొదటి సారి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అన్‌ రిజర్వ్‌డ్‌కు కేటాయించడంతో అవకాశం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

మండలాల వారీగా జెడ్పీటీసీ రిజర్వేషన్లు

ఎస్టీ మహిళ : ఆత్మకూరు

ఎస్సీ జనరల్‌ : గోస్పాడు, పాములపాడు, రుద్రవరం

ఎస్సీ మహిళ : జూపాడుబంగ్లా, కొత్తపల్లె,పగిడ్యాల

బీసీ జనరల్‌ : బనగానపల్లె, నందికొట్కూరు, పాణ్యం, ప్యాపిలి

బీసీ మహిళ : గడివేముల, మహానంది, మిడుతూరు

అన్‌రిజర్వ్డ్‌ : ఆళ్లగడ్డ, బండిఆత్మకూరు, బేతంచెర్ల, చాగలమర్రి, అవుకు, శిరివెళ్ల, వెలుగోడు

జనరల్‌ మహిళ : డోన్‌, దొర్నిపాడు, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, నంద్యాల, సంజామల, ఉయ్యాలవాడ

మండలాల వారీగా ఎంపీపీ రిజర్వేషన్లు

ఎస్టీ మహిళ : పాణ్యం

ఎస్సీ జనరల్‌ : ఆత్మకూరు, మిడుతూరు, ఉయ్యాలవాడ

ఎస్సీ మహిళ : బేతంచెర్ల, దొర్నిపాడు,నందికొట్కూరు

బీసీ జనరల్‌ : జూపాడుబంగ్లా, పగిడ్యాల,సంజామల, డోన్‌

బీసీ మహిళ : వెలుగోడు, పాములపాడు, బండిఆత్మకూరు

అన్‌రిజర్వ్డ్‌ : గడివేముల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, కొత్తపల్లి, నంద్యాల, ప్యాపిలి, మహానంది

జనరల్‌ మహిళ : ఆళ్లగడ్డ, బనగానపల్లె, చాగలమర్రి, గోస్పాడు, అవుకు, రుద్రవరం, శిరివెళ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement