స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

కల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం తథ్య మని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. మంగళవారం కల్లూరు అర్బన్‌ 36, 37 వార్డుల్లో నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్డుల వారీగా పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజలతో మమేకమయ్యే విధానాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన కార్యకర్తలను ఎన్నటికీ మరచిపోమన్నారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తల సేవలను గుర్తిస్తూ వారికి తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో 36, 37వ వార్డులకు చెందిన పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement