డోన్ రూరల్: ఎద్దుపెంట గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు కృష్ణ, నరసయ్య, లక్ష్మన్న, సురేష్, గోరంట్ల, సంజప్పతో పాటు 15 కుటుంబాలు మంగళవారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. బుగ్గన స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యా, వైద్యం, సాగు, తాగు నీటి రంగాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిచిన దార్శనికులు మాజీ మంత్రి బుగ్గన అని పార్టీలో చేరిన ఎద్దుపెంట గ్రామానికి చెందిన నాయకులు అన్నారు.


