సేవలు తొలగించడంతో ఇబ్బందులు
గ్రామ సచివాలయాలతోపాటు మీ సేవ కేంద్రాల్లో పలు రకాల సేవలను నిలిపి వేయడంతో విద్యార్థులు, రైతులు అవస్థలు పడుతున్నారు. కుల, ఆదాయ ధ్రువపత్రాలు గ్రామ సచివాలయల్లో రాకపోవడం, మనమిత్ర యాప్‌పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు పొందటం కష్టంగా మారింది. వీటికోసం గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు మండల కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
– ఓబులేసు, రాయలసీమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కోవెలకుంట్ల
గ్రామ సచివాలయాల్లో నాలుగు రకాల సేవలను తొలగించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నాకు ఇద్ద రు కుమారులు సంతానం కాగా వారు నంద్యాలలో చదువుతున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలో గతంలో సర్టిఫి కెట్లు వచ్చేవి. ప్రస్తుతం పత్రాల రీ ఇష్యూ సేవలను నిలిపి వేయడంతో సర్టిఫికెట్లు ఎలా పొందాలో అర్థం కావడం లేదు.
– దినకర్, విద్యార్థి తండ్రి, వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం


