మహానంది: దసరా సెలవులు రావడంతో మహానంది ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. సెలవులతో పాటు దసరా నవరాత్రి ఉత్సవాలు ఉండటంతో వేలాది మంది తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణాలు కళ సంతరించుకున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. భక్తులు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
కోనేరులో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు


