క్యూఆర్‌ కోడ్‌తో స్థలపురాణం | - | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌ కోడ్‌తో స్థలపురాణం

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల క్షేత్ర పరిధిలో పలుచోట్ల స్థల పురాణాన్ని తెలిపే క్యూఆర్‌ కోడ్‌ బోర్డులను ఏర్పాటు చేసినట్లు దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. వారు మంగళవారం మాట్లాడుతూ.. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా భక్తులు శ్రీశైల క్షేత్ర స్థల పురాణాన్ని, క్షేత్ర విశేషాలను, చారిత్రక అంశాలను, ఆలయ నిర్మాణ శైలి తదితర వాటిని సంభాషణ, లిఖిత రూపంలో పొందవచ్చని వివరించారు. మొత్తం 130 భాషలలో ఈ విశేషాలను తెలుసుకోవచ్చన్నారు. క్షేత్ర పరిధిలో 60 ప్రదేశాలలో ఈ బోర్డులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార–పంచధార, శిఖరేశ్వరం, పంచమఠాల విశేషాలను తెలియజెప్పే బోర్డులను ఆయా ఆలయాల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement