పులకుర్తి నుంచి వలస వెళ్తున్న కూలీలు
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడటం, ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో సొంత ఊరిలో ఉపాధి లభించక పులకుర్తి గ్రామానికి చెందిన కూలీలు పిల్లాజెల్లాతో వేరే ప్రాంతాలకు వలస బాట పట్టారు. స్థానికంగా పనులు లేకపోవడంతో బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వెళుతున్నట్లు వారు చెప్పారు. కుటుంబ సభ్యులు, పసిపిల్లలతో సహా మూటముల్లె సర్దుకుని పొట్ట చేతపట్టుకుని వాహనాల్లో పనుల కోసం వెళ్తున్న దయనీయ పరిస్థితు లు కనిపిస్తున్నాయి. సొంత ఊరిలో వ్యవసాయ పనులు దొరక్కపోవడం, ఉపాధి పనులు కల్పించక పోవడంతోనే వలస వెళ్లాల్సి వస్తోందని కూ లీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కరువు ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించి, వలసలను అరికట్టాలని కోరుతున్నారు.
– గూడూరు


