ట్రాక్టర్‌ కింద పడి వలస కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ కింద పడి వలస కూలీ మృతి

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

కోసిగి: మండల పరిధిలోని సాతనూరు గ్రామానికి చెందిన గొరవయ్య గారి చిన్న శేషప్ప(38) వలస వెళ్లిన చోట మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. చిన్న శేషప్పకు సాతనూరులో 2 ఎకరాల పొలం ఉంది. ఈ ఏడాది ఎకరన్నర పొలంలో పత్తి , అర ఎకరాలో వరి సాగు చేసుకున్నాడు. తుంగభద్ర నదికి నీళ్లు రాకపోవడం, వర్షాలు లేక పోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. అప్పులు పెరిగి పోవడంతో కుటుంబ పోషణ భారమై బతుకుదెరువు కోసం భార్య పిల్లలతో కలిసి మూడు రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం యాదిగిరి జిల్లా గోనేహాల్‌ గ్రామానికి వలస వెళ్లాడు. అక్కడ పత్తి పొలంలో పనులు చేసుకుంటున్నారు. మంగళవారం పత్తి పొలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ అంత పనిచేసి.. పత్తిని ట్రాక్టర్లలో వేసుకొని బయలుదేరారు. అయితే పొలం గట్టు వద్ద అదుపు తప్పి చిన్న శేషప్ప ట్రాక్టర్‌పై నుంచి కింద పడగా.. వెనుక టైర్‌ ఎక్కడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నాగమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏనాడు వలస వెళ్లకుండా గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించేవారు. కానీ ఈఏడాది వర్షాలు లేక పోవడంతో పంటలు పండక పనులు కోసం వలస వెళ్లారు. వెళ్లిన మూడు రోజులకే ప్రమావశాత్తు చనిపోవడంతో ఆ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయింది.

నాటుసారా స్థావరాలపై దాడులు

పత్తికొండ: నియోజకవర్గ పరిధిలో ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి ఉంచిన 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. విజయవాడ, కర్నూలు,అనంతపురం జిల్లాలకు చెందిన ఎకై ్స జ్‌ శాఖ ఉన్నతాధికారులు రామకృష్ణారెడ్డి, రాజశేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పత్తికొండ, గు త్తి, గుంతకల్‌కు చెంది న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ అధికారులు ఉద యం నుంచి సాయంత్రం వరకు నాటుసారా స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి మండలాల పరిధిలో పెండ్లిమాన్‌ తండా, రోళ్లపాడు తండా, ఎర్రగుడి తండా, చెరువు తండాలో నాటుసారా తయారు చేసే స్థావరాలపై దాడులు చేసి సారా తయారీ కోసం సిద్ధం చేసిన బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు మూడు కేసులు నమోదు చేశారు. నాటుసారా తయారు చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పత్తికొండ ఎకై ్సజ్‌ సీఐ సువర్ణలత తెలిపారు. పత్తికొండ ఎకై ్సజ్‌ శాఖ పరిధిలో నాటుసారా విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు దాడులు ముమ్మరం చేసినట్లు ఆమె వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement