వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

కర్నూలు కల్చరల్‌: ఉద్యోగులు వృత్తి నైపుణ్యాలను మెరుగు పరుచుకున్నప్పుడే తమ బాధ్యతలను సరైన రీతిలో నిర్వహించగలరని రాయలసీమ యూ నివర్సిటీ రెగ్యులర్‌, క్లస్టర్‌ యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీ వి.వెంకట బసవరావు పేర్కొన్నారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్‌ యూనివర్సిటీల అధికారులు, బోధనేతర సిబ్బందికి వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులను వర్సిటీ సెనేట్‌ హాల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. వర్సిటీ పాలనకు సంబంధించి వివిధ అంశాలపై విషయ నిపుణులు అందించే సూచనలు, సలహాలను అవగాహన చేసుకుంటే ప్రతి ఉద్యోగి పురోగతి సాఽధించే అవకాశం ఉంటుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే శిక్షణను సద్వినియో గం చేసుకోవాలన్నారు. డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్‌ వీసీ పి.షేక్షావలి ఖాన్‌ మాట్లాడుతూ.. ఈ ఆఫీస్‌, ఈ ఫైలింగ్‌ వంటి విషయాలపై ఉద్యోగులకు అవగాహన ఉండాలన్నారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ పూర్వ డైరెక్టర్‌ జనరల్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డి.చక్రపాణి మాట్లాడుతూ.. బోధనేతర ఉద్యోగులు సాంకేతికతను అందిపుచ్చుకొని బాధ్యతల పట్ల నిబద్ధత ప్రదర్శించాలన్నారు. కర్నూలులో త్వరలో అందుబాటులోకి రానున్న ఏవియేషన్‌ రంగం, డ్రోన్‌ హబ్‌ తదితర వాటిని తెలుసుకుంటూ భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. రిజిస్ట్రార్‌లు విజయకుమార్‌ నాయుడు, డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ కార్యనిర్వాహక కార్యదర్శులుగా వ్యవహరించారు. ప్రిన్సిపాల్‌ వెంకట సుందరానంద పుచ్చ, డీన్‌లు సీవీ కృష్ణారెడ్డి, ఎన్‌. నరసింహులు, భరత్‌కుమార్‌, ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు, నాగరా జు శెట్టి, డాక్టర్‌ ఇందిరా శాంతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement