రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– అవుకు ఆర్‌అండ్‌బీ రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. 108 అంబులెన్స్‌ సిబ్బంది అందించిన సమాచారం మేరకు.. మండలంలోని రేవనూరుకు చెందిన రవికుమార్‌, రంగనాయకులు, వీరకుమార్‌ గౌండా పని నిమిత్తం అవుకు మండలం రామాపురానికి బైక్‌పై వెళ్లారు. పని ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు. సంజామల మండలం ఆల్వకొండకు చెందిన ఉసేన్‌బాషా, ఉసేన్‌వలి మాత్రలు తీసుకునేందుకు కోవెలకుంట్లకు బైక్‌పై వచ్చి తిరిగి వెళుతుండగా పట్టణ శివారులోని రైల్వే వంతెన సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో రవికుమార్‌కు కాలు విరిగింది. మిగతా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పాణ్యంలో చోరీ

పాణ్యం: మండల కేంద్రంలో వైఎస్సార్‌ విగ్రహం వద్ద ఉన్న ఓ ఫ్యాన్సీ స్టోర్‌లో మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు చోరీ జరిగింది. బాధితులు బచ్చు రవి తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని దుండగుడు షాప్‌ తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి రూ.85 వేల నగదు ఎత్తుకెళ్లారన్నారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు తెలిపారు. చోరీ ఘటనపై పాణ్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మండలంలో రాత్రి సమయాల్లో దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల పాణ్యం, నెరవాడ తదితర గ్రామాల్లో సుమారు 8 సెల్‌ఫోన్లు చోరీ గురయ్యాయి. వరుస దొంగతనాలతో ప్రజల్లో అలజడి మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement