అన్యాయం చేశారు | - | Sakshi
Sakshi News home page

అన్యాయం చేశారు

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

అన్యాయం చేశారు తీవ్రంగా నష్టపోయాం

మాకు 20 ఎకరాల (8 హెక్టార్లు) భూమి ఉంది. ప్రధానంగా పత్తి సాగు చేశాం. అంతర పంటలుగా సజ్జ, కంది, ఆముదం వేశాం. ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టాం. దిగుబడి అసలు రాలేదు. రెండు హెక్టార్లకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.34 వేలు ఇస్తామని చెబుతున్నారు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా అన్యాయం చేశారు. హెక్టారుకు కనీసం రూ.25 వేల ప్రకారం ఇవ్వాలి.

– బాయికాటి రామచంద్ర,

పోతుగల్‌ గ్రామం, కృష్ణగిరి మండలం

మా కుటుంబానికి 17 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో కంది సాగు చేశాం. ఎకరాకు రూ.15 వేల ప్రకారం పెట్టుబడి పెట్టాం. దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయాం. అన్ని ఎకరాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తేనే న్యాయం జరుగుతుంది.

–నరసింహారెడ్డి, బొల్లవానిపల్లి, తుగ్గలి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement