గడువులోగా అర్జీలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

నంద్యాల(న్యూటౌన్‌): ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో ప్రజల నుంచి 276 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పెండింగ్‌ దరఖాస్తులు నిర్దేశిత గడువు దాటకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌ ద్వారా మొత్తం 148 అర్జీలు స్వీకరించామన్నారు.

అనాథ విద్యార్థిని ఉన్నత విద్యకు భరోసా..

గతేడాది చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో మట్టిమిద్దె కూలిన ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఇంటర్మీడియెట్‌ విద్యార్థిని గురులక్ష్మి ప్రసన్నకు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా అండగా నిలిచారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో విద్యార్థినితో మాట్లాడి ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. పేదరికం, ప్రతికూల పరిస్థితులు విద్యకు అడ్డంకులు కాకూడని, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని విద్యార్థినికి సూచించారు. ఆమె విద్యాభ్యాసం నిరాటంకంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement