రుద్రవరం: కొండమాయపల్లెలో ఓ మహిళ వడదెబ్బతో మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయ కూలీ లక్ష్మీదేవి (58) గురువారం తోటి కూలీలతో కలిసి మండలంలోని ఆర్.నాగులవరం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో పచ్చి మిర్చి కోతకు వెళ్లింది. అయితే మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను గ్రామంలోని ఓ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స అందిస్తుండగా కోలుకోలేక మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త నడిపి రంగముని, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.


