స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

నంద్యాల(న్యూటౌన్‌): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే సమయానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేసి, పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గురువారం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, జేసీ సూరజ్‌ ధనుంజయ్‌, డీఆర్‌ఓ రాము నాయక్‌ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ఆరు పట్టణాల పరిధిలో 212 ఎన్నికల వార్డులు, 511 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి భవనాల స్థితిగతులు, తాగునీరు, విద్యుత్‌, వెలుతురు, మరుగుదొడ్లు, ర్యాంపులు తదితర కనీస సౌకర్యాలను నిర్ధారించాలన్నారు. గత ఎన్నికల అనుభవాలు పరిగణనలోకి తీసుకుని పోలీసు అధికారులతో సమన్వ యం చేసుకుంటూ సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ కేంద్రాలను త్వరగా ఖరారు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement