కర్నూలు: పోగొట్టుకున్న, చోరీకి గురైన 589 సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు, స్థానిక పోలీసులు రికవరీ చేసిన రూ.1.20 కోట్ల విలువ చేసే 589 సెల్‌ఫోన్లను ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు మధుసూదన్‌రావు, శివశంకర్, సైబర్ ల్యాబ్ ఎస్‌ఐలు వెంకటమోహన్, ఆశాలత పాల్గొన్నారు.


