కర్నూలు: ఆదోని ఏఎస్పీగా నూతనంగా నియమితులైన జయశర్మ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్‌ను, ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా విధులు నిర్వహించిన జయశర్మ ఆదోని ఏఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కర్నూలులోని రేంజ్ కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్‌ను, క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదోని సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని ఆమెకు సూచించారు.
గుండెపోటుతో బ్యాంకు క్యాష్ వ్యాన్ డ్రైవర్ మృతి
వెల్దుర్తి: బ్యాంకు క్యాష్ వ్యాన్ డ్రైవర్ షేక్ మాసూం(45) గుండెపోటుతో గురువారం మృతిచెందాడు. కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాసూం ఎన్‌ఆర్ పేటలో ఉంటున్నాడు. బ్యాంకు లోన్‌తోనే క్యాష్ ట్రాన్స్‌పోర్టు వ్యాన్ సమకూర్చుకున్నాడు. సీఏసీ ద్వారా బ్యాంకుల నుంచి ఏటీఎంలకు, శాఖలకు ఎనిమిదేళ్లుగా నగదు తరలిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా గురువారం నలుగురు గార్డులతో తన వ్యాన్‌లో వెల్దుర్తి ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వచ్చాడు. తిరిగివెళ్లేందుకు వాహనంలోని తన సీటులో కూర్చునేందుకు డోర్ తీస్తూ అక్కడికక్కడే కూలబడ్డాడు. గమనించిన గార్డులు గుండెపోటుకు గురయ్యాడని తెలుసుకుని హుటాహుటిన అదే వాహనంలో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య గౌసియా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక సీహెచ్‌సీకి చేరుకుని మృతదేహాన్ని కర్నూలుకు తీసుకెళ్లారు.
బెల్లం ఊట ధ్వంసం
హొళగుంద: నెరణికి తండా కొండల్లో నాటుసా రా తయారీకి ఉంచిన 150 లీటర్ల బెల్లం ఊట ను గురువారం పోలీసులు ధ్వంసం చేశారు. గమ్య నాయక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలి పారు. ఈ నెల 21న జరిగే దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాల్లో భాగంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాటుసారా తయారు చేయడం, విక్రయించడం నేరం అన్నారు.
పట్టపగలే భారీ చోరీ
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని సూగూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భారీ చోరీ జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో లక్ష్మిరెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని గుర్తించి దొంగలు తాళం పగలగొట్టారు. ఇంట్లోకి వెళ్లి రెండు బీరువాలను పగులగొట్టి అందులో ఉన్న రూ.3 లక్షల నగదు, మూడు తులాల బంగారం, 50 తులాల వెండి సామగ్రి దోచుకెళ్లారు. నాలుగు రోజుల క్రితం పత్తి అమ్ముకోగా వచ్చిన డబ్బు చోరీ అయ్యిందని బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మల్లికార్జున తన సిబ్బందితో వెళ్లి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటు తెలిపారు.
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని కల్లుదేవకుంట గ్రామంలోని ఆలయాల్లో దొంగలు పడ్డారు. గ్రామ శివార్లలో ఉన్న శివాలయ ంలో దుండగులు మంగళవారం రాత్రి చొరబ డి రెండు పెద్ద దీపాలు, గంట, భజన సామగ్రి ఎత్తుకెళ్లినట్లు శివాలయం పూజారి బసప్ప తెలి పారు.అదే విధంగా బుధవారం రాత్రి సూగూ రు రహదారిలోని మారెమ్మ ఆలయంలో 4 దీ పాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే అక్కడ సోలార్‌తో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్, వాయిస్ అలర్ట్ చేయడంతో దుండగు డు 4 దీపాలు అక్కడే వదిలి పరారయ్యాడు.


