కర్నూలు: విచారణలో ఉన్న ఖైదీల కేసుల స్థితిగతులపై జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సమీక్షించారు. జైళ్ల అధికారులు, జైళ్లను సందర్శించే న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లకు గురువారం పలు సూచనలు చేశారు. దీర్ఘకాలంగా విచారణలో ఉన్న కేసులు, బెయిల్‌కు అర్హత కలిగిన ఖైదీలు, బెయిల్ పొందిన అనంతరం విడుదలకు సంబంధించిన అంశాలపై చర్చించా రు. అర్హత కలిగిన విచారణ ఖైదీలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. ఖైదీల హక్కుల పరిరక్షణకు, సత్వర న్యాయం అందించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించడం, అవసరమైన సందర్భాల్లో సంబంధిత న్యా యస్థానాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం వంటి చర్యలను చేపట్టాలన్నారు. జిల్లా సబ్ జైళ్ల అధికారి రామకృష్ణ, జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, జైలర్ ఎరికి నాయుడు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, ప్యానల్ న్యాయ వాది రామదాసు, పారా లీగల్ వాలంటీర్లు మధుసూదన్, హనీఫ్ పాల్గొన్నారు.
వాల్మీకి గుహలకు సందర్శకుల తాకిడి
డోన్ రూరల్: ప్యాపిలి మండలం వాల్మీకి గుహలకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. గురువారం కర్ణాటక రాష్ట్రం గంగావతి జిల్లా దేవనగిరి ప్రాంతానికి చెందిన వారితో పాటు అనేక మంది ఈ గుహల అందాలను తిలకించి పరవశించి పోయారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదింది. ఈ గుహలతో బిల్వసర్గం గుహలను, వెంగళాంపల్లె, వెంకటాపురం తుమ్మల చెరువుల్లో బోటు సికారు కేంద్రాలను అభివృద్ధి చేసింది.


