‘స్థానిక’ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పనిసరి

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ మనోహరి

● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ మనోహరి

కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశం లేదని, తప్పకుండా ఓడిపోతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్వీ విజయమనోహరి అన్నారు. కర్నూలు మేయర్‌ పీఠం వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోవడం తథ్యమని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలకు గురువారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ విజయమనోహరి మాట్లాడుతూ..రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అత్యాచారాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయని, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ శాంతియుతంగా నిరసన ర్యాలీలో పాల్గొంటే 53 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయడం సరైంది కాదన్నారు. అక్రమ కేసులకు తమ పార్టీ శ్రేణులు భయపడబోరని, రెట్టింపు ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement