లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
కర్నూలు: జిల్లాలో రెన్యువల్ కాని మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ ముగిసింది. 2026–27 ఒక సంవత్సర కాల పరిమితితో మద్యం షాపుల లైసెన్సు మంజూరు చేయుటకు గురువారం ఉదయం జిల్లాపరిషత్ సమావేశ భవనంలో లక్కీడిప్ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ సమక్షంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ ను వీడియోగ్రాఫ్ తీస్తూ విజేతలైన వారికి దుకాణాలు కేటాయించారు. మొత్తం 17 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా 62 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 15 మద్యం దుకాణాలకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన వాటికి లాటరీ నిర్వహించారు. విజేతలైన 15 మందికి వెంటనే నాలు గో వంతు లైసెన్సు రుసుం ఎక్సైజ్ ఆర్ఈటీ, మూడో వంతు పర్మిట్ రూము ఫీజు వసూలు చేశారు. జిల్లాపరిషత్ కాంపౌండ్ ఆవరణంలోనే రుసుం చెల్లించేందుకు బ్యాంకు కౌంటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎకై ్సజ్ అధికారుల సమక్షంలోనే విజేతల నుంచి రుసుం వసూలు చేశారు. అనంతరం ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు వారికి రెండు వారాల కాల పరిమితితో ప్రొవిజినల్ లైసెన్సును జారీ చేశారు. జిల్లాలో మరో రెండు దుకాణాలు ఇప్పటికీ రెన్యువల్ పెండింగ్లో ఉన్నాయి. వాటికి కలెక్టర్ అనుమతితో రీ–నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు తెలిపారు.
అదృష్టాన్ని పరీక్షించుకున్న మహిళలు...
లాటరీలో ముగ్గురు మహిళలకు దుకాణాలు దక్కా యి. ఇందులో టీడీపీ నేత, జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ సతీమణికి ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ మద్యం దుకాణం లాటరీలో దక్కింది.


