మంత్రాలయం/మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని చెట్నెహళ్లి గ్రామంలోని మండల పరిషత్ ఉన్న త పాఠశాలలో మహిళ టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయులపై అధికారులు విచారణ చేపట్టారు. జిల్లా విధ్యాధికారి ఆదేశా ల మేరకు గురువారం ఆదోని ఇన్చార్జ్ డిప్యూటీ ఈఓ రాజేంద్ర ప్రసాద్, జీసీడీఓ మహిళ అధికారి వసీమా, ఎంఈఓ నాగభూషణం విచారణ చేపట్టారు. విచారణ కు వచ్చిన అధికారులతో లైంగిక వేధింపులకు పాల్పడిన హెచ్ వరప్రసాద్, సహకరించిన అబ్దుల్లాను సస్పె ండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేసి ధర్నా కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మల్లికార్జున పాఠశాలకు చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులతో మట్లాడి ముందు విచారణ చేయడానికి సహకరించాలని కోరారు. ముందుగా ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులతో విడివిడిగా విచారణ చేపట్టి రాత పూర్వకంగా లెటర్లను తీసుకున్నారు. 4, 5వ తరగతి విద్యార్థులతో మహిళాధికారి విచారణ చేసి వారి వివరాలు తీసుకున్నారు. అదే విధంగా జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కూడా విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వివరాలు, చేసిన విచారణ నివేదికలను జిల్లా విద్యాధికారి పంపుతామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు హేంద్రబాబు, వీరేష్, థామ స్, సురేంద్రబాబు పాల్గొన్నారు.


