● రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ● ముగ్గురికి తీవ్ర గాయాలు ● రాతన సమీపంలో ప్రమాదం
తుగ్గలి: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌కు చెందిన నలుగురు వ్యక్తులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కారులో వెళ్లారు. దర్శనం అనంతరం గురువారం తిరిగి ఇంటికి బయలు దేరారు. తుగ్గలి మండలం రాతన ఆశ్రమ పాఠశాల సమీపంలో కారు, కడప నుంచి గుజరాత్ వెళుతున్న లారీ ఢీకొన్నా యి. కారులో చిక్కుకున్న క్షతగాత్రులను స్థానికులు గడ్డపారతో డోర్లు తెరిచి బయటకు తీశారు. ప్రమాదంలో చిక్‌బళ్లాపూర్‌కు చెందిన భుజంగన్ అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రకాష్, బాలకృష్ణ, సుదీప్‌లను చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. ప్రమాద స్థలాన్ని పత్తికొండ రూరల్ సీఐ పెదయ్యనాయుడు, తుగ్గలి, జొన్నగిరి ఎస్‌ఐలు నరేష్, మల్లికార్జున పరిశీలించారు. ఘటనకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ నరేష్ తెలిపారు.


