నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఎస్.రవికుమార్ పర్యవేక్షణలో, అసిస్టెంట్ ఎకై ్సజ్ కమిషనర్ ఆర్.హనుమంతరావు సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 26 జనరల్ కేటగిరీ మద్యం దుకాణాలతో పాటు గీత కులాలకు కేటాయించిన ఒక దుకాణం కలిపి మొత్తం 27 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు. వీటిలో 19 దుకాణాలకు దరఖాస్తులు అందగా, మిగిలిన ఏడు దుకాణాలకు ఎలాంటి దరఖాస్తులు అందలేదు. నిబంధనల ప్రకారం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు అందిన దుకాణాలకు మాత్రమే లాటరీ నిర్వహించగా, ఈ విధానంలో మొత్తం 16 దుకాణాలను కేటాయించారు. బనగానిపల్లెలోని రెండు దుకాణాలకు ఒక్కో దుకాణానికి ఇద్దరు చొప్పున, కోవెలకుంట్లలోని ఒక దుకాణానికి ఒక్క దరఖాస్తు మాత్రమే అందింది. నిర్దేశిత కనీస సంఖ్యలో దరఖాస్తులు లేకపోవడంతో ఈ మూడు దుకాణాలకు లాటరీ నిర్వహించలేదు.


