దొర్నిపాడు: రైతుసేవా కేంద్రాల్లో కియోస్కీలు పనిచేయడం లేదు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులను బుకింగ్ చేసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసి రైతు భరోసా పథకం, పంటల బీమా, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సబ్సిడీలకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో ఎరువులు, విత్తనాలు కావాలన్నా రైతు సేవాకేంద్రాల్లో రైతులు గంటల తరబడి నిల్చోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రబీ సాగులో భాగంగా సబ్సిడీ శనగ విత్తనాల కోసం రైతులు కార్యాలయాల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. కియోస్కీలు పనిచేస్తుంటే ఇంత ఇబ్బందులు ఉండేవి కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


