మాకు 3.5 ఎకరాల బైలు పొలం ఉంది. వర్షాలు లేక విత్తనం వేయలేకపోయాం. బోరు కింద ఉన్న మూడు మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని పొలంలో పత్తిని వేశాం. అందుకోసం రూ.90 వేల పెట్టుబడి పెట్టాం. ఇప్పటి వరకు పైసా రాలేదు. పంట పండే పరిస్థితే లేదు.
– రాజు, కొంగనపాడు, కల్లూరు
నేను మూడు ఎకారల్లో పత్తిని వేశాను. అరకొరగా కురిసిన వర్షాలతో పంట ఎదుగుదల లేకుండా బతికే ఉంది. అధికారులు స్వయంగా వచ్చి పరిశీలిస్తే ఎంత పంట వస్తుందో తెలుస్తుంది. కల్లూరు కరువు మండలంగా ప్రకటించాలి. రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం
– మనోహర్, రేమడూరు, కల్లూరు మండలం


