ఈ ఏడాది ఖరీఫ్‌లో కుందూనది పరివాహకంలో ఐదు ఎకరాల సొంత పొలంలో వరి పంట సాగు చేశాను. రబీలో ఎకరా రూ. 16 వేలు కౌలు చెల్లించి 10 ఎకరాల్లో ఇటీవలే మహేంద్ర రకానికి చెందిన జొన్న విత్తనం వేశాను. మరో ఐదు ఎకరాల్లో పప్పుశనగ సాగుకు విత్తనాలు, రసాయన ఎరువులు సమకూర్చుకున్నాను. ఈ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని వరుణుడిపై భారం వేసి పంటలు సాగు చేశాను. ఈ నెలలో కూడా వర్షం పడకపోతే పెట్టిన పెట్టుబడులు నేలపాలై నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
– తిరుపతయ్య, రైతు, వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం


