వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

కర్నూలు టౌన్‌: వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు దక్కాయి. రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాలకు నాయకులను నియమిస్తూ బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎర్వా మల్లికార్జన రెడ్డి (నంద్యాల), రాష్ట్ర ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యాటా ఓబులేసు (నందికొట్కూరు)ను, రాష్ట్ర బీసీ సెల్‌ సంయుక్త కార్యదర్శిగా కుడితికుంట నాగేశ్వరమ్మను (పాణ్యం) నియమించారు. జిల్లా మత్య్సకార విభాగం అధ్యక్షుడిగా మచ్చ నాగరాజు (నందికొట్కూరు), జిల్లా రజక విభాగం అధ్యక్షుడిగా చాకలి చిన్న మద్దిలేటి (బనగానపల్లె), జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా బి. భాస్కర్‌ రెడ్డి (నంద్యాల), జిల్లా యువజన విభాగం కార్యదర్శి పి. బాల అంకాలు (నంద్యాల) నియమితులయ్యారు.

పిన్నాపురం కొండపై చిరుతపులి

పాణ్యం: పిన్నాపురం గ్రామ సమీపంలోని కొండపై బుధవారం చిరుతపులి కనిపించింది. స్థానికులు గమనించి భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వారు పిన్నాపురం గ్రామానికి వచ్చి చిరుతపులిని సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు.

12న జాతీయ అప్రెంటీషిప్‌ మేళా

డోన్‌ టౌన్‌: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 12వ తేదీ ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటీషిప్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ నాగకేశాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాకు కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఐటీఐ పాసైన వారు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

నంద్యాల(న్యూటౌన్‌): ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని జిల్లా అదనపు ఎస్పీ సుస్మిత తెలిపారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకొని అందు కోసం పట్టణంలో ఏర్పాటైన పోలింగ్‌ కేంద్రాలనుమున్సిపల్‌ కమిషనర్‌ శేషన్నతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకొనేలా అవసరమైన సౌకర్యాలను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంజినీర్‌ నాగభూషణంరెడ్డి, డీఈ పవన్‌కుమార్‌, రసూల్‌ ఆజాద్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారి నరసింహమూర్తి, రిజ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు.

1.6 టన్నుల యూరియా సీజ్‌

బనగానపల్లె రూరల్‌: బనగానపల్లె పట్టణంలోని సత్యం కెమికల్స్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ దుకాణంలో యూరియాను సీజ్‌ చేసినట్లు జిల్లా వ్యవసాయ ఉపసంచాలకులు ఆర్‌. గంగధర్‌ రావు తెలిపారు.ఎమ్మార్పీ రూ.1,650 ఉండగా రూ.2,080లకు విక్రయిస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో బుధవారం తనిఖీ చేశామన్నారు. దుకాణంలో ప్రస్తుతం 1.6 టన్నుల యూరియాను సీజ్‌ చేసినట్లు చెప్పారు. దుకాణాల్లో అధిక ధరకు ఎరువులు విక్రయిస్తే మండల వ్యవసాయాధికారికి రైతులు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో సాంకేతిక వ్యవసాయాధికారి కళ్యాణ్‌కుమార్‌, ఏఓ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement