బాబూ.. కరువు కనిపించలేదా? | - | Sakshi
Sakshi News home page

బాబూ.. కరువు కనిపించలేదా?

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

కర్నూలు(సెంట్రల్‌): పంటలన్నీ ఎండిపోయాయి.. కూలీలే కాదు రైతులు కూడా వలస వెళ్తున్నారు..అయి నా సీఎం చంద్రబాబుకు కరువు కనిపించడం లేదని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ఎదుట బుధవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు నిర్వహించిన ధర్నాలో కాటసాని మాట్లాడారు. మూడు నెలలపాటు బీడుగా ఉన్న పొలాలు చిన్న వానతో మొలకెత్తాయని, దానిని సాకుగా చూపి కల్లూరును కరువు మండలంగా ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. ఎండిన పంటలను పట్టించుకోకుండా లక్ష కోట్లు అంటూ సీఎం చంద్రబాబునాయుడు విమానాల్లో తిరుగుతున్నారని, ఆయన భూమిపై నడిస్తే రైతుల దుస్థితి తెలుస్తుందని సూచించారు. తీవ్ర నష్టాలు వచ్చి అన్నదాత అల్లాడిపోతుంటే పట్టించుకోకండా రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ పేరిట సంబరాలు చేయడం దారుణమన్నారు.

కదంతొక్కిన రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

కల్లూరును కరువు మండలంగా ప్రకటించాలని రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు కదం తొక్కారు. కాటసాని ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు ఎండిన పంటలను ప్రదర్శించారు. కర్నూలులో బిర్లా గేటు నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కల్లూరును కరువు మండలంగా ప్రక టించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరికి వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు బిర్లాగేటులో ఉన్న పూలే విగ్రహానికి కాటసాని పూలమాల వేసి నివాళి అర్పించారు.

రైతు వ్యతిరేక ప్రభుత్వం

టీడీపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని కాటసాని విమర్శించారు. అశాసీ్త్రయంగా కరువు మండలాల ప్రకటన చేశారని, క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కరువు మండలాలపై టీడీపీ నాయకులు స్పందించకవడం అన్యాయమన్నారు. అధికారంలోకి ఉండి రైతులకు అన్యాయం చేయడం దారుణమన్నారు. వెంటనే కల్లూరును కరువుగా మండలంగా ప్రకటించకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ధర్నాలో వైఎస్సార్‌సీపీ పాణ్యం ఆబ్జర్వర్‌ సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ సిద్ధారెడ్డి రేణుక, నాయకులు కేశవరెడ్డి, రామకృష్ణారెడ్డి, కల్లా వెంకట రమణారెడ్డి, పర్లసుంకన్న, పర్ల శ్రీధర్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, ఈశ్వర య్య, అశోక్‌వర్ధన్‌రెడ్డి, నారాయణరెడ్డి, పలువురు మాజీ సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

విమానాల్లో కాదు భూమిపై తిరగాలి

ఎండిపోయిన పంటలను

పరిశీలించాలి

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా

అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

కర్నూలులో భారీ ర్యాలీ.. ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement