ప్రశాంత వాతావరణంలో బన్ని ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో బన్ని ఉత్సవాలు

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

కర్నూలు(సెంట్రల్‌): దేవరగట్టు బన్ని ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో దేవరగట్టు బన్ని ఉత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు, హొళగుంద, హాలహర్వి, ఆలూరు మండలాల అధికారులు, సంబంధిత గ్రామాల పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఉత్సవ ప్రాంతం, ఆలయ పరిసరాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. గత సంవత్సరాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి ఏర్పాట్లను మరింత సమర్థవంతంగా చేపట్టాలన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ గతంలో బ్లాక్‌ స్పాట్‌ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో అదనపు లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఇనుప రింగులు అమర్చిన కర్రలను ముందుగానే గుర్తించి స్వాధీనం చేసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, పత్తికొండ ఆర్డీవో ఓబులేసు, ఆదోని ఆర్డీవో అరుణ దేవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement