మధ్యవర్తిత్వంపై వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వంపై వర్క్‌షాప్‌

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

కర్నూలు: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన న్యాయవాదులకు, ఎన్‌జీఓలకు జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యాలయ భవనంలో ఒక రోజు వర్క్‌షాప్‌ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి వాసు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించాలని హైకోర్టు తీర్మానించిందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు నెల నుంచి మధ్యవర్తిత్వం 3.0పై ఉమ్మడి జిల్లాల్లోని అన్ని కోర్టుల్లో ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యవర్తిత్వం ఏ విధంగా చేయాలని న్యాయవాదులకు, ఎన్‌జీఓలకు అవగాహన కల్పించారు. చైన్నె నుంచి వచ్చిన మధ్యవర్తిత్వం శిక్షణ సిబ్బంది ఆర్‌.విజయకమల న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమన్నారు. శాశ్విత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించుకోవచ్చన్నారు. కర్నూలు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ చంద్రుడు, కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులు, ఎన్‌జీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement