ఎస్సీ హాస్టల్‌ సిబ్బందిపై వేటు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ హాస్టల్‌ సిబ్బందిపై వేటు

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

● వార్డెన్‌ సస్పెన్షన్‌

● ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని తొలగింపు

● వర్కర్‌కు ఉద్వాసన

ఆదోని: విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించకుండా ప్రైవేట్‌ వ్యవహారాలు నడుతుపున్న ఆదోని ఎస్సీ హాస్టల్‌ సిబ్బందిపై జిల్లా కలెక్టర్‌ సిరి కొరడా ఝుళిపించారు. గత ఆదివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఖాళీ ప్లేట్లతో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. తమ వార్డెన్‌ హాస్టల్‌లో ఓ మహిళతో సన్నిహితంగా ఉంటూ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనపై సాక్షి దినపత్రికలో ఈ నెల 5న ‘ఖాళీ ప్లేట్లతో విద్యార్థుల ఆందోళన’ అనే శీర్షికన వార్త రావడంతో జిల్లా కలెక్టర్‌ స్పందించారు. ఆర్డీఓ అరుణాదేవిని విచారణకు ఆదేశించారు. ఎస్సీ హాస్టల్‌కు వెళ్లిన ఆర్డీఓ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్‌ చేశారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్‌ సిరి బుధవారం కీలక చర్యలు తీసుకున్నారు. హాస్టల్‌ వార్డెన్‌ నాగమద్దయ్యను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అంతే కాకుండా వార్డెన్‌తో సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఆర్డీఓ విచారణకు వెళ్లినప్పుడు విద్యార్థులు అక్కడ విధులు నిర్వహిస్తున్న మరో హాస్టల్‌ వర్కర్‌పై కూడా ఫిర్యాదులు వచ్చాయి. తమతో హాస్టల్‌లో మసాజ్‌ చేయించుకుంటున్నారని విద్యార్థులు తెలపడంతో ఆయన మీద కూడా కలెక్టర్‌కు ఆర్డీఓ నివేదికను సమర్పించారు. దీంతో సదరు ఉద్యోగిపై కూడా సస్పెన్షన్‌ వేటు పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement