సుర్రుమంటున్న సూరీడు | - | Sakshi
Sakshi News home page

సుర్రుమంటున్న సూరీడు

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

ఉష్ణోగ్రత వివరాలు

తేదీ గరిష్టం కనిష్టం

ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో ఎడారి పరిస్థితులు

సాధారణం కంటే 3–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు

ఎండల తీవ్రతకు ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు

తాగునీటికి కటకట.. పశువులకు మేత కరువే

సాధారణం కంటే 3–4 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయి

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, కాల్వల్లో చుక్క నీరు లేదు. వేసిన పంటలు ఎండిపోయాయి. ఎటు చూసిన నిస్తేజం, నిర్వేదమే. బానుడు వేసవి తరహాలో భగభగ మండుతున్నారు. వెరసి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్టోబరు నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అధికారులు చెబుతున్నారు. అన్నిటికీ మూలం ఎల్‌నినోనే.

గాలిలో పడిపోయిన తేమ శాతం

వేసవిలో ఉమ్మడి కర్నూలు జిల్లా దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతం. ప్రస్తుతం వేసవికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో చెరువులు, కుంటలు 450 వరకు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 385 వరకు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడం వల్ల 90 శాతం చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేదు. దీంతో గాలిలో తేమ శాతం పడిపోయింది. ఈ సమయంలో గాలిలో తేమ 80 శాతం వరకు ఉండాలి. కానీ ఉదయం పూట గాలిలో తేమ 40 శాతం, మధ్యాహ్నం సమయంలో 50–60 శాతం వరకు మాత్రమే ఉంటోంది. దీంతో వేడిగాలుల తీవ్రత పెరిగింది. సాధారణంగా అక్టోబరులో ఉష్ణోగ్రతలు 33–34 డిగ్రీల వరకు నమోదు కావాలి. నేడు 37 నుంచి 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత వేసవి కంటే ఎక్కువగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు. బుధవారం నందికోట్కూరులో 38 డిగ్రీలు, కల్లూరులో 37.4, పాణ్యంలో 37.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చలికాలం లేనట్లే !

నవంబరు నుంచి శీతాకాలం మొదలవుతుంది. సూపర్‌ ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి చలికాలం ఉండే అవకాశం లేదని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ఒకవైపు ఉక్కపోత సమస్యలు పెరుగుతున్నాయి. ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతున్నాయి. రోజుకు 10.58 మిలియన్‌ యూనిట్ల రోజువారి విద్యుత్‌ వినియోగం కోటా ఉండగా, 13.25 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారు. చలి లేకపోతే రబీలో ప్రధాన పంటైన పప్పు శనగ కూడా లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్టోబరు నెలలో ఎడారి పరిస్థితులు నెలకొని ఉండటం చరిత్రలో ఇదే మొదటిసారి. కర్నూలు జిల్లాలో రబీ సాధారణ సాగు 1,07,475 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో సాధారణ సాగు 1,93,935 హెక్టార్లు ఉంది. మొదటిసారి ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌ కూడా దెబ్బతింటుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

1వ తేదీ 37,8 26.6 2వ తేదీ 37.6 26.2

3వ తేదీ 37.4 25.8

4వ తేదీ 37.4 25.8

5వ తేదీ 37.3 26.4

6వ తేదీ 37.3 26.6

7వ తేదీ

అక్టోబరు మాసంలో తాగునీటికి కొరత ఉండదు. పశువులకు పచ్చి మేత కొదువ ఉండదు. కానీ నేడు పశువులకే కాదు, మనుషులకు కూడా తాగునీటి సమస్య ఏర్పడింది. పశువులకు మేత కరువైంది. ఈ సమయంలో కొండలు, కోనలు, బీడు భూములు పచ్చగా ఉండాలి. కానీ నేడు పచ్చదనం అంతరించిపోయింది. భారత వాతావరణ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎల్‌నినో తీవ్రతపై హెచ్చరికలు చేసింది. అయితే.. గట్టెక్కడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించలేదు. వరి వేసుకోవద్దు అని చెప్పడం తప్ప.. వరి వేసుకోకపోతే తలెత్తే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి సారించలేదు.

ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ సారి పొడి వాతావర ణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీల వరకు ఎక్కువగా ఉంటాయి. వర్షాపాతం అతి తక్కువగా ఉంటుంది. ఈ సారి చలి ప్రభా వం ఉండే అవకాశం లేదు. రబీలో శనగ ప్రధాన పంట. చలి వాతావరణం, మంచు లేకపోతే శనగలో దిగుబడులు ఉండవు. ప్రస్తుత వాతావరణం వేసవిని తలపిస్తోంది. రబీ సాగుకు అనువైన పరిస్థితులే లేవు. భూమిలో తేమ పూర్తిగా పడిపోయింది. ఇపుడు గాలిలో తేమ 80 శాతం ఆపైనే ఉండాలి. కాని 50–60 శాతం వరకు మాత్రమే గాలిలో తేమ ఉంటోంది.

– నారాయణ స్వామి, సీనియర్‌ వాతావరణ శాస్త్రవేత్త, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement