తృటిలో తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన పెను ప్రమాదం

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం

బనగానపల్లె రూరల్‌: మండలంలోని కటికవానికుంట ఘాట్‌ రోడ్డులో బుధవారం ప్రయాణికులతో బనగానపల్లెకు వస్తున్న ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మద్దిలేటిస్వామి క్షేత్రం నుంచి కటికవానికుంట గ్రామం మీదుగా యాగంటి క్షేత్రానికి వస్తుండగా క్షేత్రం కొండపై మలుపుల వద్ద బస్సు స్టీరింగ్‌ కట్టకు సంబంధించిన బోల్ట్‌ ఉడిపోయింది. డ్రైవర్‌ బస్సును అదుపుచేసే క్రమంలో రోడ్డుపక్కనున్న పెద్ద గుండురాయిని ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులు 11 మంది ప్రయాణికులు ఉన్నారు. కొందరికి స్పల్ప గాయాలుకాగా, బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు. రోడ్డు పక్కన పెద్ద బండరాయి లేకుంటే బస్సు లోయలో పడి పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement