ఉపాధి పనులు చేస్తుండగా ఆగిన గుండె | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులు చేస్తుండగా ఆగిన గుండె

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

ఆదోని రూరల్‌: పొట్ట కూటి కోసం భార్యాభర్తలు ఉపాధి పనికి వెళ్లగా భర్త అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలి మృత్యువాత పడిన ఘటన మండలంలోని గణేకల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఎన్‌.పెద్దరామయ్య (50), భార్య సిద్ధమ్మ కూలీ పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. వీరికి ఒక కుమార్తె చాముండేశ్వరి (మానసిక దివ్యాంగురాలు) ఉంది. బుధవారం భార్యభర్తలు ఉపాధి పనికి వెళ్లారు. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురై పెద్దరామయ్య కుప్పకూలిపోయాడు. భార్య గుండెలు బాదుకుంటూ రోదించడంతో తోటి కూలీలు ఆయన్ను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఎర్రని ఎండకు కష్టపడి పని చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలి పడ్డాడని భార్య సిద్ధమ్మ వాపోయింది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి మృతితో భార్య, కుమార్తె ఆసరా కోల్పోయారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement