దాడిచేయబోయిన విద్యార్థుల తల్లిదండ్రులు
పోలీసుల అదుపులో హెచ్ఎం, ఉపాధ్యాయుడు
మంత్రాలయం/మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని చెట్నెహళ్లి గ్రామ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్లుపై లైంగిక వేధింపులు, వికృత చేష్టల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం పాఠశాలలో ఉపాధ్యాయురాలు మౌనిక రెండవ తరగ తి విద్యార్థినీలకు పాఠాలు బోధిస్తుండగా హెచ్ఎం, మరో ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థినిలతో రికార్డులపై నీళ్లు పోయించారు. ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు విద్యార్థులను చితకబాదారు. విద్యార్థులు రోదిస్తూ ఇళ్లకు వెళ్లడంతో సమస్య తీవ్రమైంది. హెచ్ఎం వరప్రసాద్, ఉపాధ్యాయుడు అబ్దుల్లా గత కొద్ది రోజులుగా తమను లోబర్చుకోవాలని ఇలాంటి ఘట నలు సృష్టించి వేధింపులకు గురి చేస్తున్నారని పాఠఽశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయినులు మౌనిక, పావని ఆరోపించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాఠఽశాల వద్దకు చేరుకుని హెచ్ఎం, ఉపాధ్యాయుడిపై దాడి చేసేందు కు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మల్లిఖార్జున తన సిబ్బందితో పాఠశాల వద్దకు చేరుకుని వారిని చెదరగొట్టారు. అనంతరం మండల విద్యాధికారి నాగభూషణం జెడ్పీ పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. ఇరువురు ఉపాధ్యాయులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో వేధింపుల విషయం వాస్తమేనని తేలిందన్నారు. విషయం ఉపాధ్యాయినుల కుటుంబ సభ్యులకు తెలియడంతో పాఠశాల వద్దకు చేరుకుని హెచ్ఎంపై దాడికి యత్నించారు. పక్కనే ఉన్న పోలీసులు హెచ్ఎం వరప్రసాద్, టీచర్ అబ్దుల్లా ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే ఘటనకు బాధ్యులైన హెచ్ఎం వరప్రసాద్, ఉపాధ్యాయుడు అబ్దుల్లాపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత వై.ప్రదీప్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఫిర్యాదు చేసిన మహిళా ఉపాధ్యాయులు


