● మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగిన బంధువులు | - | Sakshi
Sakshi News home page

● మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగిన బంధువులు

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

● మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగిన బంధువులు

లారీ చక్రాల కింద నలిగిన ప్రాణం

గడివేముల: లారీ ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన బుధవారం మండల పరిధిలోని బూజునూరు గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆవుల గౌతం (23) కిరాణం దుకాణం నుంచి సరుకులు తీసుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా జిందాల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ ఢీకొట్టింది. లారీ టైర్లు అతనిపై ఎక్కడంతో శరీరం నుజ్జునుజ్జయ్యింది. గ్రామస్తులు వెంటనే గడివేముల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు జిందాల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ వెళ్లే రహదారిలో నంద్యాల–నందికొట్కూరు రహదారిపై రాళ్లు, బైకులు అడ్డంపెట్టి నిరసనకు దిగారు. గ్రామంలోకి భారీ వాహనాలు రాకుండా చూడాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండు చేశారు. పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి అక్కడికి చేరుకుని వారితో మాట్లాడిన ఫలితం లేకుండా పోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో స్కూలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు బస్సుల వద్దకు వచ్చి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement