● ఎన్నికల వేళ.. చట్టవిరుద్ధంగా వైఎస్సార్‌సీపీ నేతలపై బైండోవర్‌ కేసులు ● అక్రమకేసులపై న్యాయ పోరాటం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

● ఎన్నికల వేళ.. చట్టవిరుద్ధంగా వైఎస్సార్‌సీపీ నేతలపై బైండోవర్‌ కేసులు ● అక్రమకేసులపై న్యాయ పోరాటం చేస్తాం

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

● ఎన్నికల వేళ.. చట్టవిరుద్ధంగా వైఎస్సార్‌సీపీ నేతలపై బైండోవర్‌ కేసులు ● అక్రమకేసులపై న్యాయ పోరాటం చేస్తాం

పోలీసు శాఖ

ఏకపక్ష దోరణి వీడాలి

కర్నూలు (టౌన్‌): స్థానిక ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ బైండోవర్‌ కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని ఆ పార్టీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు జి.స్వాములు అన్నారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. రెండున్నరేళ్లుగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం, జైళ్లకు పంపడం చేశారన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని, వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. పోలీసు యంత్రాంగం పక్షపాత దోరణితో వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతిరోజు తెలుగుదేశం నాయకులు దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసు శాఖ పట్టించుకోవడం లేదని విమర్శించారు. శాంతి భద్రతల పేరుతో ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నాయకులను, కార్యకర్తలను వేధించడం వెంటనే ఆపాలన్నారు. పోలీసులు రాజ్యాంగానికి కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై నమోదు చేస్తున్న అక్రమ కేసులపై లీగల్‌ సెల్‌ తరఫున కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement