ఎక్కువ కేసులు పరిష్కరించిన వారికి అవార్డులు | - | Sakshi
Sakshi News home page

ఎక్కువ కేసులు పరిష్కరించిన వారికి అవార్డులు

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

కర్నూలు: జాతీయ లోక్‌ అదాలత్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 66 వేలకు పైగా కేసులు పరిష్కారమయ్యా యి. రాష్ట్రంలోనే మూడో స్థానం సాధించిన సందర్భా న్ని పురస్కరించుకుని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వా సు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో బుధవారం ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేసిన జడ్జిలకు, న్యాయవాదులకు, పోలీసు, ఎకై ్సజ్‌ అధికారులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అవార్డుల ప్రదానం జరిగింది. సివిల్‌, క్రిమినల్‌ కేసులు పరిష్కరించిన జడ్జిలు అనూష, టి.భాస్కర్‌, ఎస్‌.జ్యోతి, కె.హేమ, వెంకటరామిరెడ్డి, నూరుల్లా, క్రిమినల్‌ కేసులు పరిష్కరించిన డీఎస్పీలు వీరరాఘవేంద్ర, పి.శ్రీనివాసులు, యాక్సిడెంట్‌ కేసులు పరిష్కరించిన న్యాయవాది రామాంజనేయులు, పోలీసులను అవార్డులతో సత్కరించారు. కర్నూలు కోర్టు మానిటరింగ్‌, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ రామయ్య నాయుడుకు కూడా అవార్డు అందజేశారు. ఫోక్సో కోర్టు అదనపు జిల్లా జడ్జి రాజేంద్రబాబు, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement